📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహైదర్‌నగర్ డివిజన్‌లో రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులు

హైదర్‌నగర్ డివిజన్‌లో రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులు

📰 Generate e-Paper Clip

హైదర్‌నగర్ డివిజన్‌లో రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులు

రేపు జలవాయు విహార్ కాలనీలో శంకుస్థాపన.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య హాజరు

కూకట్‌పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి)

హైదర్‌నగర్ డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో రూ.1 కోటి 33 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదర్‌నగర్ డివిజన్‌లోని జలవాయు విహార్ కాలనీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్డు డివైడర్ ఏర్పాటు, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే కాలనీలో రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.
ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.