*వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు అందించే పింఛన్ డబ్బుల్లో చిల్లరను 16 రూపాయలను కాజేస్తున్న నేరేడుచర్ల తపాలా కార్యాలయ సిబ్బంది*
నేరేడుచర్ల/ ప్రజావాణి, అక్టోబర్ 27
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వ మంజూరు చేసే ఆసరా పింఛన్ డబ్బుల్లో వృద్ధులకి 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయలు చెల్లిస్తూ ఉంటే నేరేడుచర్ల మండలం తపాలా కార్యాలయంలో ప్రతినెలా సిబ్బంది 16 రూపాయలు కాజేస్తూ గట్టిగా అడిగిన వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారు కాదు కూడదు అంటేనే 16 రూపాయలు ఇస్తున్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు చేస్తున్నారు తపాల ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వృద్ధులకి కంటి ఐరిస్ సరిగా పడటం లేదని రెండు నెలల డబ్బులు ఒకేసారి తీసుకొని చెప్పి వెళ్ళిపోతున్నారు డబ్బులు వచ్చేసరికి మరల వారి కమిషన్ వారు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్లి డబ్బులు చెల్లిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి డిఆర్డిఏ, తపాలా ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో సరైన పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా పింఛన్దారులకు డబ్బు సక్రమంగా పూర్తి రూపాయలు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వృద్ధులు వికలాంగులు వితంతువులు కోరుతున్నారు.

