📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించిన శివాని

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించిన శివాని

📰 Generate e-Paper Clip

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించిన శివాని

విద్యార్థినిని అభినందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్‌పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి):

రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో రెజ్లింగ్‌ విభాగంలో బంగారు పతకం సాధించి కూకట్‌పల్లికి గర్వకారణంగా నిలిచిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని నాడికుడి శివానిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అభినందించారు. 57 కేజీల విభాగంలో శివాని స్వర్ణ పతకం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శివాని వడ్డేపల్లి రాజేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందించిన రాజేశ్వరరావు, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రులతో పాటు కూకట్‌పల్లి ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటాలని ప్రోత్సహించారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను నిరూపించుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శివాని సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి కొడిచర్ల వినోద్ కుమార్, ఖైతలాపూర్ డివిజన్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.