📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*రైతుల సమస్యలు పరిష్కరించాలి: భారతీయ కిసాన్ సంఘ్*

*రైతుల సమస్యలు పరిష్కరించాలి: భారతీయ కిసాన్ సంఘ్*

📰 Generate e-Paper Clip

*రైతుల సమస్యలు పరిష్కరించాలి: భారతీయ కిసాన్ సంఘ్*

*రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి*

మేడ్చల్ అక్టోబర్ 26 (పీపుల్స్ డైరీ):- భారతీయ కిసాన్ సంఘ్ మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్యాల వెంకటరెడ్డి పాల్గొని రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసీల్దార్‌కు వివరించారు. ముఖ్యంగా ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సంబంధిత అధికారుల ద్వారా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రైతుల సమస్యలపై స్పందిస్తూ, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.