*ప్రతి కుటుంబ మహిళ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం…*
*స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు.*
*ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26*
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య పరి రక్షణ కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆరోగ్య సేవల ప్రాముఖ్య తను వివరిస్తూ , ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆరోగ్యమే నిజమైన సంపద అని , వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని , తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అందించే ఆరోగ్య పరీక్షల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ , పేద , మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు చేరువ కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నా యని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ కొయ్యడ రజిని-శ్రీనివాస్, పోచంపల్లి , జూలూరు పిఎసిఎస్ చైర్మన్లు పాక మల్లేష్ యాదవ్ , కళ్లెం రాఘవ రెడ్డి , డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి , డిఎంహెచ్ఓ మనోహర్ , సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు అంజయ్య , పోచంపల్లి మండల కాంగ్రెస్ అధ్య క్షులు ఉప్పునూతల వెంకటేష్ , ఇతర నాయకులు , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

