📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఔషపూర్‌లో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

ఔషపూర్‌లో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్ ఔషపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుండె ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీకి నూతన బాధ్యులను ఎంపిక చేశారు.

నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిలకమర్రి యోహాన్, ఉపాధ్యక్షులుగా మహేష్, మహేష్ (చిన్న), ప్రధాన కార్యదర్శిగా పెద్దోళ్ల జీవన్, మీడియా కన్వీనర్‌గా కన్నాల ప్రకాష్, సహాయ కార్యదర్శిగా కిరణ్ కుమార్‌ను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిలకమర్రి మహేష్, మండల ఉపాధ్యక్షులు జమ్మిగారి గణేష్, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, ఈదిగల్ల ప్రవీణ్ కుమార్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షులు చిలుగూరి ఆనంద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేస్తూ, సంఘం అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.