📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసుప్రీంకోర్టు సీజేఐ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పట్లోళ్ల భావన

సుప్రీంకోర్టు సీజేఐ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పట్లోళ్ల భావన

📰 Generate e-Paper Clip

సుప్రీంకోర్టు సీజేఐ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పట్లోళ్ల భావన

ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌.. నేరడిగుంట గ్రామానికి గర్వకారణం

మన ప్రజావాణి ఆందోల్, అక్టోబర్ 26: జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన పట్లోళ్ల భావన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముంబైలో జరిగిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమంలో భావన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, యూనివర్సిటీ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కరద్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.
నేరడిగుంట గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేశ్వరి, వైద్యనాథ్ (రాజు) దంపతుల కుమార్తె భావన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా భావన తల్లిదండ్రులు మహేశ్వరి, రాజు పటేల్ విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుమార్తె దేశవ్యాప్తంగా రెండో ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంలోనే వారి జీవితానికి సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
తమ కుమార్తె ఈ ఘనత సాధించడంలో అమ్మమ్మ చంద్రమ్మ, తాతయ్య నాగిశెట్టి ఆశీస్సులతో పాటు, తమ వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న నేరడిగుంట గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణ ఎంతో తోడ్పడ్డాయని వారు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు
నేరడిగుంట గ్రామానికి చెందిన మాలి పటేల్ కుటుంబంలో ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని, తద్వారా నేరడిగుంట గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన పట్లోళ్ల భావనకు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.