📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమిడతపల్లి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

మిడతపల్లి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

📰 Generate e-Paper Clip

మిడతపల్లి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 26(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘనపురం మండలం, నెల్లుట్ల గ్రామానికి చెందిన మిడతపల్లి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ సోమవారం హుటాహుటిన వారి నివాసానికి వెళ్లారు.

అక్కడ మిడతపల్లి నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి, తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ, మిడతపల్లి నర్సయ్య గ్రామంలో మంచి వ్యక్తిగా, అందరితో కలివిడిగా ఉండేవారని, ఆయన మరణం గ్రామానికి, కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్, జిల్లా కమిటీ సభ్యులు దామెర నాగరాజు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, మాజీ సర్పంచ్ నల్ల అబ్బసాయిలు, వార్డు సభ్యుడు నల్ల అజయ్, బొజ్జం సునీత ప్రభాకర్, నాయకులు కుర్రేముల రమేష్, కొండ్ర యోనా, నల్ల బాబు, మిడతపల్లి రామచంద్రం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.