📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబోరంచ గ్రామంలో సీసీ రోడ్డు, స్నానాల ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

బోరంచ గ్రామంలో సీసీ రోడ్డు, స్నానాల ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

📰 Generate e-Paper Clip

*బోరంచ గ్రామంలో సీసీ రోడ్డు, స్నానాల ఘాట్ ప్రారంభించిన*

*ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 26 సంగారెడ్డి జిల్లా*

సంగారెడ్డి జిల్లా
_నారాయణఖేడ్ నియోజకవర్గం_
మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో శ్రీ సంగమేశ్వర ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును, మాఘ అమావాస్య సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నాన ఘాట్‌ను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈరోజు ప్రారంభించారు.

ముందుగ శ్రీ సంగమేశ్వర ఆలయం స్వామి వారి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తరువాత సింగూర్ నీటిని ఎమ్మెల్యే పరిశీలించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా సీసీ రోడ్డు నిర్మాణం, పుణ్యస్నానాల కోసం ప్రత్యేక స్నాన ఘాట్ ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భోజి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్లోళ్ల లోకేష్ రెడ్డి యువ నాయకులు, గ్రామ సర్పంచ్ బీరప్ప కురుమ, ఉప సర్పంచ్ కరీం,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బోరంచ గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.