జుక్కల్ లో ఘనంగా వాల్మీకి జయంతి..
నాగనాథ్ మహారాజ్ కీర్తన ఎంతో చక్కగా కీర్తన
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 26
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి కీర్తన భజన తో నాగనాథ్ మహారాజ్ ఎంతో మంచిగా చక్కగా వాల్మీకి చరిత్రను చెప్పడం జరిగింది.. వాల్మీకి రాసిన కథ గురించి చెప్పి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం సోమవారం రోజున నాగనాథ్ మహారాజ్ ఎంతో చక్కగా తెలుగులో అర్థమయ్యే విధంగా వాల్మీకి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు.. వాల్మీకి రాసిన కవిత్వం గురించి చాలా చక్కగా వివరించి ఒక కీర్తన భజనలతో ఎంతో చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముదిరాజ్ సంఘం కమిటీ అధ్యక్షులు నంగేవారు సాయిలు, ఉపాధ్యక్షులు పల్లె మారుతి, ముదిరాజ్ మండల అధ్యక్షులు నంగేవార్ భూమన్న, బల్బీం, తుకారం,పల్లె యాదవ్, ఔటి అంజయ్య, పల్లె సంగ్రం, గుడెలుగువార్ మొగులన్న, దౌతపూర్ విట్టల్, సంగ్రామ్, మచ్చుకురి సాయిలు, మచ్ కురి బలరాం, సున్నపు వార్ గంగారం, పుల్ల శివాజీ, ముదిరాజ్ యువకులు హనుమాన్లు, రాజు, సాయిలు, బాలాజీ, బద్రీనాథ్, లక్ష్మణ్, లక్ష్మణ్, మారుతి, అజయ్ కుమార్, తదితరులు అలాగే మహిళలు మంగళారతులతో జండా దగ్గరికి వెళ్లి టెంకాయలు కొట్టి గులాలు చల్లారు. ఘనంగా వాల్మీకి జయంతిని జుక్కల్ గ్రామస్తులు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు..

