📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులు

శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులు

📰 Generate e-Paper Clip

శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులు
దండేపల్లి, అక్టోబర్ 25 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం అభినవ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి శబరిమలకు మహా పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప భక్తులకు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దింటి భాస్కర్, బుద్దే వెంకటేష్, మొరుపుటాల తులసి, ఆలిశెట్టి అరుణ్ కుమార్‌లు అయ్యప్ప స్వామి దర్శనార్థం గూడెం నుంచి శబరిమలకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గూడెం నుంచి రాయపట్నం వరకు సాగిన పాదయాత్రలో గోపతి రాజయ్య పాల్గొని భక్తులకు తన సంఘీభావం తెలిపారు.
మహా పాదయాత్రకు బయలుదేరిన భక్తులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వారి పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని క్షేమంగా తిరిగి రావాలని కుమారస్వామిని మనసా, వాచా, కర్మణా ప్రార్థించినట్లు గోపతి రాజయ్య తెలిపారు. అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఆశీస్సులతో భక్తుల యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.