*ఆలేరు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ…*
*తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం అలయ్ బలయ్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25*
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో బండ్రు ఫౌండేషన్ బండ్రు శోభా రాణి భాస్కర్ ఆధ్వర్యం లో ఆదివారం రోజున నిర్వహించిన దసరా అలయ్ బలయ్ కార్య క్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తా త్రేయ హాజరయ్యారు. రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, భాస్కర్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ. అందరూ ఒకచోట చేరి ఆత్మీయంగా కలుసు కునేందుకు తోడ్పడే గొప్ప స్నేహపూర్వక కార్యక్రమ మే అలయ్ బలయ్ అని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ఈ కార్య క్రమం ప్రతిబింబమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , ఆర్టీఏ కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి , అరుణో దయ విమలక్క , గాయ కుడు నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి , బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి , ప్రముఖ న్యాయవాది ఎం.ఏ. రహీమ్ , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ , వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు , ప్రజా ప్రతి నిధులు , మహిళలు , కళాకారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

