📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఔషాపూర్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి

ఔషాపూర్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ ఔషాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉర్సు-ఎ-షరీఫ్ ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దైవ ఆశీస్సులు పొందారు.

ఈ ఉత్సవాలు మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మీర్ సర్ఫరాజ్ నవాబ్, ఔషాపూర్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నిసార్ అహ్మద్, ఎదులాబాద్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.