మేడ్చల్ RUB నుంచి రైలాపూర్ వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కావడంతో పాటు, రైలాపూర్–గౌడవెల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల స్థానిక బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, రాకపోకలు సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని నాయకులు తెలిపారు. సంబంధిత పనులు త్వరితగతిన ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ మాజీ కౌన్సిలర్ వంగేటి లావణ్య హనుమంత్ రెడ్డి, మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కొండం ఆంజనేయులు, రైలాపూర్ మాజీ సర్పంచ్ బండ నర్సింహా, మాజీ ఉపసర్పంచ్‌లు వంగేటి రవీందర్ రెడ్డి, మెట్టు పెంటా రెడ్డి, బీజేవైఎం జిల్లా మాజీ కార్యదర్శి రాఘవ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బొక్క మల్లా రెడ్డి, చీర్ల సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్ రెడ్డి, మెట్టు హనుమంత్ రెడ్డి, మేకల రవీందర్ రెడ్డి, బొక్క సురేందర్ రెడ్డి, బండి బాబు గౌడ్, వంగేటి బాబుల్ రెడ్డి, రాగం ఆనంద్, చంద్రపాల్ రెడ్డి, బాలరాజ్, మహేందర్ యాదవ్, తలారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ రోడ్డు విస్తరణకు రూ.6 కోట్లు.. రైలాపూర్–గౌడవెల్లి బ్రిడ్జికి రూ.7.40 కోట్లు మంజూరు
RELATED ARTICLES

