📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriయంనంపేట్‌లో భూభారతి–భూసర్వేపై అవగాహన సదస్సు.....భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్‌పై రైతులకు అవగాహన

యంనంపేట్‌లో భూభారతి–భూసర్వేపై అవగాహన సదస్సు…..భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్‌పై రైతులకు అవగాహన

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 24 (ప్రజావాణి): మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని యంనంపేట్‌ గ్రామంలో భూభారతి–భూసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్‌, భూదార్‌ కార్డుల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం, భూముల సర్వే ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవడం, భూ రికార్డుల్లో పారదర్శకతకు సంబంధించిన అంశాలను అధికారులు వివరించారు. భూముల రక్షణ, రైతుల సంక్షేమం, పారదర్శక రెవెన్యూ వ్యవస్థ లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ సాయిరాం, మండల సర్వేయర్‌, మాజీ సర్పంచ్‌ పతేప్పు రాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ గౌడ్‌, సగ్గు శ్రీనివాస్‌, పొలాగోని ప్రభాకర్‌ గౌడ్‌, రేగు సత్యనారాయణ, పతేప్పు పోశెట్టి, పొలాగోని కృష్ణ గౌడ్‌, నలరాళ్ల కొండల రెడ్డి, బీజేపీ నాయకుడు పతేప్పు పాండు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు హాజరై భూసర్వేకు సంబంధించిన అంశాలపై అవగాహన పొందారు.

ఈ సందర్భంగా పోచారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మెట్టు గణేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ, భూముల రక్షణతో పాటు రైతులకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా అందేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.