*నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం*
నర్సాపూర్.అక్టోబర్ 24 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి.
నర్సాపూర్,తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ..
గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, కనీస వేతనం రూ.30,000/-గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులకు హెల్త్, సేఫ్టీ లేదని, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, పట్టాదారులకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికి పైగా మున్సిపల్ కార్మికులు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత, హెల్త్ సౌకర్యాలు లేవని, ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా, 3 సంవత్సరాలు గడుస్తున్నా హామీలు అమలు కాలేదని విమర్శించారు.
ఈ డిమాండ్ల సాధన కోసం 2026 అక్టోబర్ 26న (చలో హైదరాబాద్) రాష్ట్రవ్యాప్త పోరాటానికి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని, ఈ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ మేనేజర్ ను కోరినట్లు తెలిపారు.
డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పుష్ప, రాములు, అనిత, అశోక్ , మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

