📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీజేపీ రాష్ట్ర కీసాన్ మోర్చ కార్యవర్గ సభ్యుడిగా తక్కళ్లపెళ్లి సంపత్ రావు బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర కీసాన్ మోర్చ కార్యవర్గ సభ్యుడిగా తక్కళ్లపెళ్లి సంపత్ రావు బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట్ర కీసాన్ మోర్చ కార్యవర్గ సభ్యుడిగా తక్కళ్లపెళ్లి సంపత్ రావు బాధ్యతల స్వీకరణ.

ఎల్కతుర్తి మండలానికి దక్కిన రాష్ట్రస్థాయి పదవి

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన తక్కళ్లపెళ్లి సంపత్‌రావు బీజేపీ రాష్ట్ర కీసాన్ మోర్చ కార్యవర్గ సభ్యుడిగా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టడంతో పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో సంపత్‌రావుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సంపత్‌రావు గతంలో ఒకసారి ఉప సర్పంచిగా, ఒకసారి గ్రామ సర్పంచిగా పనిచేసి ప్రజాసేవలో తనదైన అనుభవాన్ని సంపాదించుకున్నారు.
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన నాయకుడికి తొలిసారిగా రాష్ట్రస్థాయి పార్టీలో కీలక బాధ్యత లభించడం పట్ల గ్రామస్థులు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సంపత్‌రావు నియామకంతో సూరారం గ్రామానికి,ఎల్కతుర్తి మండలానికి గుర్తింపు లభించిందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తక్కళ్లపెళ్లి సంపత్‌రావుకు పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.