📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుల ఘనత: ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు...

పోరుమామిళ్ల రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుల ఘనత: ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ముగ్గురు ఎంపిక

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,అక్టోబర్ 24,ప్రజావాణి వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్/డీఎస్ఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) 2026-27 క్రికెట్ ఎంపికల్లో పోరుమామిళ్ల పట్టణానికి చెందిన రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో అకాడమీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు తమ అసాధారణ నైపుణ్యంతో సెలక్టర్ల మనసు గెలుచుకుని ఈ ఘనత సాధించారు.కడపలో నిర్వహించిన ఈ ఎంపికల పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్నారు. తీవ్రమైన పోటీ నడుమ పోరుమామిళ్ల రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.విభాగాల వారీగా ఎంపికైన క్రీడాకారుల వివరాలు:అండర్-14 గర్ల్స్ విభాగం: జె. సృజన, అండర్-14 బాయ్స్ విభాగం: కె. చరణ్ అండర్-17 బాయ్స్ విభాగం: జి. సాయికుమార్ రెడ్డి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను, వారిని ఉత్తమ తీర్చిదిద్దిన రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ డి. కరీముల్లాను పలువురు ప్రముఖులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా విజన్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు రాయపాటి పాపయ్య, పోరుమామిళ్ల మండల ఎస్‌జీఎఫ్ సెక్రటరీ పి. భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా క్రీడాకారులను అభినందించారు.రాయపాటి పాపయ్య మాట్లాడుతూ.. పోరుమామిళ్ల లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది అద్భుతమైన క్రీడా నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారని, సరైన శిక్షణ అందిస్తే వారు జాతీయ స్థాయికి ఎదుగుతారని కొనియాడారు. మండల ఎస్‌జీఎఫ్ సెక్రటరీ పి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తదుపరి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించి పోరుమామిళ్ల మండలానికి, కడప జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు పాల్గొని ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.