పోరుమామిళ్ల రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుల ఘనత: ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ముగ్గురు ఎంపిక

పోరుమామిళ్ల,అక్టోబర్ 24,ప్రజావాణి వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్/డీఎస్ఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) 2026-27 క్రికెట్ ఎంపికల్లో పోరుమామిళ్ల పట్టణానికి చెందిన రాయల్ స్టార్ క్రికెట్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో అకాడమీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు తమ అసాధారణ నైపుణ్యంతో సెలక్టర్ల మనసు గెలుచుకుని ఈ ఘనత సాధించారు.కడపలో నిర్వహించిన ఈ ఎంపికల పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్నారు. తీవ్రమైన...