📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాజాత

ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాజాత

📰 Generate e-Paper Clip

ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాజాత

ఎల్ నినో కరువు ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లద్నూరు గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు

మద్దూరు అక్టోబర్24, ప్రజా వాణి,

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌరసంబందాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జివి వెన్నెలక్క ఆదేశాల మేరకు మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా బృందం ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆటపాట నాటికల రూపంలో ప్రజలకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు హాజరై మాట్లాడుతూ ఎల్ నినో కరువు ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలని నీటిని వృధా చేయకూడదని ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అదే విధంగా పశువులకు పశుగ్రాసం సమకూర్చుకోవాలని వనమహోత్సవంలో మొక్కలు నాటి భూతాపాన్ని నివారించాలని ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఎల్ నినోను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో,ఉప సర్పంచ్ శివ కుమార్,వార్డు సభ్యులు,మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి గజ్వేల్ బృందం లీడర్ పిల్లిట్ల శ్యామ్,పుల్లూరు యాదగిరి, సారధి కవి గాయకులు, పిన్నింటి రత్నం, దూల్మిట్ట గెంటే హరిప్రసాద్,సనువాల కనకయ్య, పన్నీరు శ్రీనివాస్,ఎల్ల సిద్దులు, డప్పు తండ బిక్షపతి, బండారు నర్సయ్య,పద్మ, శైలజ,మమత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.