దేవరుప్పుల మండల తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నూతన కమిటీ ఎన్నిక
గౌరవ అధ్యక్షుడిగా జేరిపోతుల సాయిలు,
అధ్యక్షుడిగా రెడ్డి రాజుల రమేష్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జనగాం జిల్లా అధ్యక్షుడు బొల్లపల్లి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంలో మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో దేవరుప్పుల మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా కడవెండి గ్రామానికి చెందిన జేరిపోతుల సాయిలు, మండల అధ్యక్షులుగా సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి రాజుల రమేష్, ఉపాధ్యక్షులుగా కోలుకొండ గ్రామానికి చెందిన మహమ్మద్ కాశీం, ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బిల్లా తిరుపతిరెడ్డి, కార్యదర్శిగా ధర్మపురం గ్రామానికి చెందిన ధరావత్ కిషన్ నాయక్, సహాయ కార్యదర్శిగా నీర్మాల గ్రామానికి చెందిన ఇంటి మల్లారెడ్డి, కోశాధికారిగా కొత్త జలంధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సోమ్లా నాయక్, అమర్ సింగ్, కోతాటి నరసింహులు, సుద్ధపెల్లి సోమయ్య తదితరులు ఎన్నికయ్యారు.
అనంతరం నూతన మండల గౌరవ అధ
అధ్యక్షుడు జేరిపోతుల సాయిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తొలి, మలిదశ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం ఐక్యవేదిక నిరంతరం పోరాడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు:
1. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి.
2. 5 వేల కోట్ల బడ్జెట్ తో ఉద్యమకారుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
3. అమరుల కుటుంబాలకు నెలవారీ పింఛన్, ఆర్థిక భద్రత కల్పించాలి.
4. ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు ప్రత్యేక హెల్త్ కార్డులు, ఉచిత వైద్యం అందించాలి.
5. ఉద్యమకారుల పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి.
6. జార్ఖండ్ తరహాలో బస్సు పాస్, పింఛన్ సౌకర్యాలు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

