బావోజి తండాలో పోలీస్ దాడులు..
500 లీ.బెల్లం పానకం,30 లీ.సారా ధ్వంసం..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని తారాసింగ్ తండా జీపీ పరిధిలోని బావోజీ తండాలో సిఐ సత్యనారాయణ నేతృత్వంలో గుడుంబా స్థావరాలపై శుక్రవారము విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.తనిఖీలలో ఇనుగుర్తి నెల్లికుదురు కేసముద్రం ఎస్సైలు పి.నరేష్,గంగారపు కరుణాకర్, క్రాంతి కిరణ్ లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.గుడుంబ తయారీ కోసం రహస్యంగా నిల్వ ఉంచిన 500 లీటర్ల నల్లబెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేశారు. 30 లీటర్ల అక్రమ గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.అక్రమ మద్యానికి దూరంగా ఉండాలని దీంతో ఆరోగ్యాలు పాడైపోయి కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులకు సూచించారు.
బావోజి తండాలో పోలీస్ దాడులు
RELATED ARTICLES

