📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది

పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది!

పండుగ వేళ కార్మికులకు ఆర్థిక సాయం అందించిన బీజేపీ నేత ఈర్ల రాజు ముదిరాజ్

కార్మికుల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా

అమీన్‌పూర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి శ్రమను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రాజు ముదిరాజ్ తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నారంటే దాని వెనుక పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమ, అంకితభావం ఉన్నాయని కొనియాడారు. ఎండనక, వాననక ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న కార్మికుల సేవలకు వెలకట్టలేమన్నారు. పండుగ ఆనందం ఒక్కరి ఇంటికే పరిమితం కాకుండా ప్రతి కార్మికుడి కుటుంబంలోనూ వెల్లివిరియాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, కార్మికుల పట్ల తనకున్న గౌరవానికి, ఆప్యాయతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళా సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి వారి సేవలకు గౌరవం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తోందన్నారు. అదే స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల కుటుంబాల్లో చిరునవ్వులు నింపడం సమాజ బాధ్యతని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం అందించి తమ పట్ల ఆప్యాయత చాటుకున్న ఈర్ల రాజు ముదిరాజ్‌కు పారిశుద్ధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.