ఆకలి అన్నవారికి చేయూత – నెల్లుట్లలో ఫార్మర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం
నెల్లుట్లలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో రైతు సంక్షేమ ఫౌండేషన్ (ఫార్మర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సీసా శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో, అక్కినేని వెంకట్ ఆర్థిక సహాయ సహకారాలతో గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి బియ్యం, కందిపప్పు, వంట నూనె, ఉప్పు, కారం తదితర వంట సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ సీసా శ్రీధర్ గౌడ్ గారు మాట్లాడుతూ
“రైతు సంక్షేమమే మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. రైతులతో పాటు సమాజంలోని నిరుపేదలను కూడా ఆదుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దసరా పండుగ వేళ పేద కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలని ఈ చిన్న ప్రయత్నం. అక్కినేని వెంకట్ సహకారం మరువలేనిది. భవిష్యత్తులో విద్య, వైద్యం, రైతు సంక్షేమ రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శేఖర్ బేతపూడి , గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

