స్పీడ్ పెంచిన ‘ఫ్యాన్’
ప్రజలతో మమేకమవుతూ..
అడుగడుగునా రమేష్ గౌడ్‌కు నీరాజనం
మా ఓటు మీకేనంటూ.. అప్యాయతగా పలుకరిస్తున్న ప్రజలు
దర్గాలో ప్రత్యేక దువా చేసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో అక్టోబర్ 22 : ప్రజా వాణి
అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి చిట్లూరు రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయతతో అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ రమేష్ గౌడ్ ముందుకెళ్తున్నారు. తనకు మేయర్‌గా ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. దీనికి ప్రజలు కూడా మా ఓటు మీకే.. నాయనా.. అంటున్నారు. మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను రమేష్ గౌడ్ వేడుకుంటున్నారు.

దర్గాలో ప్రత్యేక దువా చేసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ :నగ రంలోని పాతూరు శ్రీ సయ్యాదా మాసుమా బీబీ సాహెబ్ దర్గాలో ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ పాల్గొన్నారు. దువా కార్యక్రమం అనంతరం వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, 13వ డివిజన్ వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిలర్ బాషాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. నగర అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనారిటీ నాయకులు రమేష్ గౌడ్ నాయకత్వానికి మద్దతు తెలిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైసీపీ నాయకులు ఏకేఎస్ ఫయాజ్, రిజ్వాన్, ఏడీసీసీ మాజీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, 13వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయనా.. ‘ఫ్యాన్’ గుర్తుకే ఓటు వేస్తాం..
“నాయనా.. మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం” అంటూ 9వ డివిజన్లో ఒక వృద్ధురాలు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు తన మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి సి.రమేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ప్రజలను కలిసిన అభ్యర్థులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. మురుగునీటి సమస్యలు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం తదితర స్థానిక అవసరాలపై స్థానికులు అభ్యర్థి రమేష్‌కు వివరించారు. స్పందించిన మేయర్ అభ్యర్థి సి.రమేష్ మాట్లాడుతూ.. “మీరు నమ్మకంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే, గెలిచిన వెంటనే డివిజన్లో నెలకొన్న సమస్యలకు ప్రాధాన్యతతో పరిష్కారం అందిస్తాం” అని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలు తమకు ప్రధాన ప్రాధాన్యత అని, అభివృద్ధి, సేవలపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలు ఓటర్లను ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ, మేయర్ అభ్యర్థి రమేష్, కార్పొరేటర్ అభ్యర్థి రాధా విజయం కోసం పూర్తి స్థాయి ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గోపాల్, లోకేష్ రెడ్డి, మక్బూల్, జిలాన్, షామీర్, ఫరీద్, గౌస్ పీర్, సాధిక్, మోహన్, బుడాన్, సీపీఐ నాయకుడు గోల్డ్ బాషా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి :
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, 61వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాలపాటి వాసంతిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 61వ డివిజన్లోని రజక నగర్లో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, 61వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాలపాటి వాసంతి గెలిపించాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే అనంతపురం అభివృద్ధి కి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు వెంకటేష్, మహిళలు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

