📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్ల దుర్గామాతను దర్శించుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

గుగ్గిళ్ల దుర్గామాతను దర్శించుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల దుర్గామాతను దర్శించుకున్న

బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

బెజ్జంకి, అక్టోబర్ 21 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గామాతను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి దర్శించుకున్నారు.అమ్మవారి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎస్సైకి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గ్రామ ఉత్సవ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఎస్సై తోట తిరుపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గుగ్గిళ్ల గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా పండుగలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు యువత, గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.