వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఘనంగా దసరా వేడుకలు
* సర్పంచ్ పోల్సాని వినోద నారాయణరావుతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్న బండారి ప్రశాంత్
జమ్మికుంట అక్టోబర్ 21 (ప్రజావాణి)
జమ్మికుంటమండలంలోనివెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోల్సాని వినోద్ నారాయణరావుతో కలిసి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ బండారి ప్రశాంత్ దసరా వేడుకల్లో పాల్గొన్నారుఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూచెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారుగ్రామంలో ఐకమత్యంసోదరభావం వెల్లివిరియాలని, ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాలకవర్గం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

