📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణన్యాయవాది నాథన్ డ్యానీ జన్మదిన వేడుకలు

న్యాయవాది నాథన్ డ్యానీ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*న్యాయవాది నాథన్ డ్యానీ చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన*

* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్,*

*ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా*

నారాయణఖేడ్: ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మానూర్ మండల్ సీనియర్ నాయకులు నాథన్ డ్యానీ జన్మదిన వేడుకలు నారాయణఖేడ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహీం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గార్లు తమ నివాస గృహంలో నాథన్ డ్యానీ చేత స్వయంగా కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగేష్ షెట్కార్ లు కూడా పాల్గొని నాథన్ డ్యానీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నాథన్ డ్యానీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు.
అనంతరం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, పత్రికా మిత్రులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు డ్యానీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాథన్ డ్యానీని శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.