📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీసుఅమరవీరుల సంస్మరణ దినం

పోలీసుఅమరవీరుల సంస్మరణ దినం

📰 Generate e-Paper Clip

*పోలీసుఅమరవీరుల సంస్మరణ దినం*
పోలీసు,ఫ్లాగ్ డే
పోలీసుఅమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువం
ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి అమరవీరుల త్యాగం వృథా కానివ్వం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం చట్టాన్ని గౌరవిస్తాం న్యాయాన్ని పరిరక్షిస్తాం ప్రజాసేవలో ముందుంటాం.
*సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్*
సూర్యాపేట,ప్రజావాణి బ్యూరో అక్టోబర్ 21:
ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పోలీసుఅమరవీరుల సంస్మరణ దినం, పోలీసు,ఫ్లాగ్ డే సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విది నిర్వహణలో దేశ వ్యాప్తంగా ప్రాణాలు అర్పించిన 154 మంది అమరవీర జవాన్ ల పేర్లను అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి స్మరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కేవలం గతంలో ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరులను స్మరించుకునే రోజు మాత్రమే కాదని, వారి త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలు అందించాలని ప్రతిజ్ఞ చేసే రోజని పేర్కొన్నారు. ప్రజలు తమ కుటుంబాలతో ప్రశాంతంగా జీవించడానికి, సమాజంలో శాంతిభద్రతలు కొనసాగడానికి, మహిళలు, పిల్లలు, వృద్ధులు భయం లేకుండా జీవించడానికి పోలీసు సిబ్బంది నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదని, అది బాధ్యత, నిబద్ధత, సేవాభావంతో కూడిన పవిత్రమైన వృత్తి అని అన్నారు. విధి నిర్వహణలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో తెలియని పరిస్థితుల్లోనూ ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతారని పేర్కొన్నారు. పోలీసు యూనిఫాం కేవలం దుస్తులు మాత్రమే కాదని, ప్రజలు పోలీసు శాఖపై ఉంచిన నమ్మకానికి, గౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.