📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా బాబా 108 వ పుణ్యతిథి వేడుకలు

ఘనంగా బాబా 108 వ పుణ్యతిథి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా బాబా 108 వ పుణ్యతిథి వేడుకలు…

జగిత్యాల పట్టణం అక్టోబర్ 21
( మన ప్రజావాణి)

జగిత్యాల జిల్లా కేంద్రంలో
శ్రీ గుట్ట రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో గల
శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో బుధవారం
సాయిబాబా 108 వ పుణ్యతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ ఆస్థాన అర్చకులు
గుంటి నిరంజన్ పర్యవేక్షణ లో ఉదయం నుండి బాబా
ప్రతిమకు భక్త్తుల స్వహస్తల మీదుగా పాలాభిషేకం గావించారు, మహిళలు విశేష పూజలు, భజనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం బాబా వారికి
వేద పండితులచే విశేష హారతి చేశారు. భక్తులకు
నిర్వాహకులు అన్నదానం
చేశారు. ఈ కార్యక్రమంలో
కళాశ్రీ అధినేత గుండేటి రాజు
పల్లెర్ల శంకర్ రావు
ఉటూరి భాస్కర్
నరేందుల అమర్
కొత్తపల్లి శ్రీనివాస్
లక్ష్మి నర్సింగరావు తదితరులు
పాల్గొన్నారు.
స్థానిక కృష్ణా నగర్ యందు
గల శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం లో కూడా బాబా 108 వ పుణ్యతిథి
వేడుకలు ఘనంగా చేశారు.
డా. సతీష్ కుమార్, మార కైలాసం, నాగుల కిషన్ గౌడ్,
రాం కిషన్ రావు, తిరుపతి గౌడ్, పూజారి గుండయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.