📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్దేవీపట్నం మండలంలో ఎంపీటీసీ. బీసీలకు తీరని అన్యాయం..!

దేవీపట్నం మండలంలో ఎంపీటీసీ. బీసీలకు తీరని అన్యాయం..!

📰 Generate e-Paper Clip

*దేవీపట్నం మండలంలో ఎంపీటీసీ. బీసీలకు తీరని అన్యాయం!*


*జనరల్ స్థానాల్లోనైనా తగిన అవకాశం దక్కేనా?*

దేవీపట్నం మండలం అక్టోబర్ :17

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ దేవీపట్నం మండలంలో నెరవేరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీని పై మండలంలోని ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో బీసీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని స్థానిక బీసీ నాయకులు  రంపచోడవరం నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షులు రేలంగి రాంబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
వేళ్లమీద లెక్కించే సీట్లు
తీవ్రమైన పోటీ
ఏజెన్సీ గిరిజన ప్రాంత పరిధిలోకి వచ్చే దేవీపట్నం మండలంలో మెజారిటీ స్థానాలు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించబడగా, కేవలం అతి తక్కువ స్థానాలు మాత్రమే ‘జనరల్’ కేటగిరీ కింద అందుబాటులోకి వచ్చాయి. దేవీపట్నం మండలంలో మూడు ఎంపీటీసీ పంచాయతీ స్థానాలను జనరల్ కేటగిరీగా వర్గీకరించారు.
అయితే, ఈ కొద్దిపాటి స్థానాలలోనైనా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. జనరల్ స్థానాలు కావడం వల్ల మిగతా వర్గాల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో, జనాభా ప్రాతిపదికన ఎంతో ప్రాధాన్యం ఉన్న బీసీ అభ్యర్థులకు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మండల స్థాయిలో కేటాయింపులు చూస్తే బీసీలు రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు తగిన అవకాశం దక్కకపోతే మేము మరింత వెనుకబడిపోతాం.

మండల బీసీ హక్కుల ప్రతినిధులు
ఆందోళనలో బీసీ ఓటర్లు
దేవీపట్నం మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లు రాజ్యాంగబద్ధమైన తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం మూడు జనరల్ సీట్లలోనైనా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తేనే ‘బీసీల ఆత్మగౌరవం’ నిలబడుతుందని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరియు కూటమి నాయకత్వం తక్షణమే స్పందించి, జనరల్ కేటాయించిన సీట్లలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేయాలని స్థానిక బీసీ నాయకులు రేలంగి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.