📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గరిసెల సురేందర్ ముదిరాజ్

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గరిసెల సురేందర్ ముదిరాజ్

📰 Generate e-Paper Clip

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్ ప్రజావాణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవనశైలికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి, మహిళల ఐక్యతకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతిరూపమని అన్నారు. తరతరాలుగా పూర్వీకులు అందించిన ఈ అపురూపమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం నిండాలని, తెలంగాణ సంస్కృతి వైభవం దశదిశలా విస్తరించి, మన సంప్రదాయాల పరిమళం తరతరాల పాటు కొనసాగాలని గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.