📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఘట్‌కేసర్ పాస్టర్ల సంఘం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఘట్‌కేసర్ పాస్టర్ల సంఘం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ మండల పాస్టర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ మండలంలోని పాస్టర్లకు, పాస్టర్ అమ్మలకు ప్రభుత్వం తరఫున అందించే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో క్రైస్తవ మైనారిటీల నాయకుడు దీపక్ జాన్, ఘట్‌కేసర్ మండల PCWAGM పాస్టర్ల సంఘం అధ్యక్షుడు రెవరెండ్ యేసు రమేష్, కార్యదర్శి రెవరెండ్ ప్రవీణ్ పాడి, రెవరెండ్ రిబ్కా శ్యామ్ నాతారి, రెవరెండ్ డేవిడ్సన్, రెవరెండ్ సురేందర్ పాల్, రెవరెండ్ కాపు కుమార్, రెవరెండ్ పుట్ట జాషువా, రెవరెండ్ మిక్కిలి విజయ్, రెవరెండ్ అబ్రహాము, రెవరెండ్ యోహాను తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పుష్పగుచ్ఛంతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఘట్‌కేసర్ మండలంలోని అర్హులైన పాస్టర్లకు, పాస్టర్ అమ్మలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.