ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఘట్‌కేసర్ పాస్టర్ల సంఘం

ఘట్‌కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ మండల పాస్టర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ మండలంలోని పాస్టర్లకు, పాస్టర్ అమ్మలకు ప్రభుత్వం తరఫున అందించే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మైనారిటీల నాయకుడు దీపక్ జాన్, ఘట్‌కేసర్ మండల PCWAGM పాస్టర్ల సంఘం అధ్యక్షుడు రెవరెండ్ యేసు రమేష్, కార్యదర్శి రెవరెండ్...