ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు మున్నూరు కాపు సంఘం సన్మానం
దండేపల్లి, అక్టోబర్ 17 (ప్రజావాణి):
దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు జగన్ ఎన్నికైన సందర్భంగా శనివారం దండేపల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం దండేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేండ్ల సత్తన్న, ప్రధాన కార్యదర్శి గడిపల్లి సత్తన్న ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుంచె ప్రసాద్, ఉపాధ్యక్షుడు బొడ్డు జగన్‌లకు శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు బొలిశెట్టి లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కాసాన కొట్టు లింగన్న, బొలిశెట్టి సత్తన్న (బద్రి), కొండు సత్తన్నతో పాటు మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

