📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపస్రా నాగారం, రాంపూర్ విభజనకు స్వస్తి పలకాలి - మువ్వ బాను ప్రకాశ్.

పస్రా నాగారం, రాంపూర్ విభజనకు స్వస్తి పలకాలి – మువ్వ బాను ప్రకాశ్.

📰 Generate e-Paper Clip

 

ఈగోలు వద్దు.. ఐక్యతే ముద్దు – ఏకమవ్వాలన్న 11వ వార్డు సభ్యుడు

రావణ వధ ఒక్కటే.. వేడుక ఒక్కటే కావాలి!

దసరా వేడుకల్లో ఐక్యత లోపం – గ్రామ పెద్దలు చొరవ చూపాలని డిమాండ్.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

గోవిందరావుపేట మండలం
పస్రా నాగారం గ్రామపంచాయతీ పరిధిలో రాంపూర్ లో ప్రతి ఏటా రెండు చోట్ల రావణ వధ నిర్వహించడం సరికాదని 11వ వార్డు సభ్యుడు మువ్వ బాను ప్రకాశ్ ఆరోపించారు.
ఒకే గ్రామం, ఒకే పంచాయతీ, ఒకే ప్రజానీకం ఉన్నప్పుడు వేడుకలు మాత్రం వేరు వేరుగా నిర్వహించడం వల్ల గ్రామంలో విభజన భావన పెరుగుతోందని ఆయన అన్నారు.
జాతీయ రహదారి 163కు ఇరువైపులా ఉన్నామనే కారణంతో పస్రా నాగారం, రాంపూర్ అంటూ విడిపోవడం వల్ల పండుగ వైభవం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దసరా అంటేనే చెడుపై మంచి విజయానికి ప్రతీక అని, రావణుడిని దహనం చేస్తూ మన మధ్య ఉన్న ఈగోలు, పట్టింపులను కూడా దహనం చేయాలని సూచించారు.
రెండు చోట్ల వేడుకల వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని, ఒక్కచోట ఐక్యంగా చేస్తేనే పండుగకు నిజమైన అర్థం వస్తుందని అన్నారు.
ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాలను, యువతను కలుపుకొని ఉమ్మడి వేదికపై దసరా జరపాలని డిమాండ్ చేశారు.
పండుగల్లోనే ఐక్యత చాటలేకపోతే తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అభివృద్ధి పనుల్లో ఎలా కలిసి పనిచేస్తామని ప్రశ్నించారు.
ఈ దసరా నుంచైనా విభజనకు స్వస్తి పలికి, ఒకే వేదిక, ఒకే రావణ వధ, ఒకే వేడుకగా నిర్వహించేలా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.
పస్రా నాగారం, రాంపూర్ వేరు కాదు, ఒకే కుటుంబమనే స్ఫూర్తితో ముందుకు సాగితేనే గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని మువ్వ బాను ప్రకాశ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.