📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుకకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే

తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుకకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుకకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, దేవరుప్పుల మండల సీనియర్ నాయకులు తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుక శుక్రవారం కన్నుల పండుగగా దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ శుభకార్యానికి పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను మనసారా ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాండు కృష్ణ మా కాంగ్రెస్ పార్టీకి బలమైన పిల్లర్ లాంటి వారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండాను భుజాన మోసిన నాయకుడు. ఆయన కుటుంబంలో జరుగుతున్న ఈ శుభకార్యానికి రావడం చాలా సంతోషంగా ఉందని, చిన్నారులు ఇద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి. బాగా చదువుకుని తల్లిదండ్రులకు, మన పాలకుర్తి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.

ఈ వేడుకకు జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు, దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దవేరా అనిల్ కుమార్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాండు కృష్ణ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

అనంతరం నిర్వహించిన విందు కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.