కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 16
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామానికి చెందిన సంఘం వారు లింగబాయి కు శుక్రవారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో సర్పంచ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పాయ్ం ఖాన్, మాజీ సర్పంచ్ వినోద్, ఎమ్మార్వో మారుతి, జిపిఓ రమేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆడపిల్లల వివాహాల కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగంగా ఉందని ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జరిగింది.

