📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధర్మరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

ధర్మరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

ధర్మరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట గ్రామ పంచాయతీలో జీపీఓ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సనంద, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొత్త ధర్మయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొత్త ధర్మయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు, ఉప సర్పంచ్ నక్క చంద్రమౌళి, గ్రామ రేషన్ డీలర్ నక్క తిరుపతి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు దాసరి ప్రసన్న, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.