📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ

349 దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ కేటాయింపునకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించారు.


తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా మద్యం విక్రయించుటకు లైసెన్సుల మంజూరు, లైసెన్సు షరతులు) నియమాలు, 2005 ప్రకారం, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో ఒక నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం (349) దరఖాస్తులు వచ్చాయి.

లాటరీలో DPSG0291 టోకెన్ నంబర్ కలిగిన గడ్డం సందీప్, తండ్రి రమేష్, వీణవంక గ్రామం, మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తుదారుడు విజేతగా ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమంలో డీపీఈఓ ఎన్. అంజిరెడ్డి, జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్), పాలకుర్తి ఎస్‌హెచ్‌ఓలు జి. శ్రీనివాసరావు, ఎన్. రఘునాథ్ రెడ్డి, ఆర్. బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.