*మోతె శోభన్ రెడ్డిని కలిసిన మేడ్చల్ ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ నాయకులు*
*ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి*
మేడ్చల్, ప్రజావాణి
:- తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డిని మేడ్చల్ ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ నాయకులు టీజీసీఎంఎఫ్సీ మేడ్చల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆరె పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికులు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ చూపాలని మోతె శోభన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులు వివరించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మోతె శోభన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. దీంతో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరె మధుకర్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు పంజగరి ఆంజనేయులు మాజీ టౌన్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయ్ రావు, ఉపాధ్యక్షుడు ఓంరాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

