ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీడీవో సాయిలు.
మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 25
కామారెడ్డి జిల్లా మద్నూర్ పెద్ద ఎక్లరా గ్రామంలో ఉపాధి హామీ పనులకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొని ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామ ప్రజలు ఉపాధి హామీ పనులపై అవగాహన పెంచుకొని, పనులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సాయిలు గ్రామ సర్పంచ్ సోమవర్ మహేష్, ఏపీఓ, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.