📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriజగదాంబ మాత ఆలయంలో ఘనంగా మహా అన్నదానం, హోమం...అన్నోజిగూడలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

జగదాంబ మాత ఆలయంలో ఘనంగా మహా అన్నదానం, హోమం…అన్నోజిగూడలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 14 (ప్రజా వాణి):

 

ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న జగదాంబ మాత శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు చండీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. పోచారం మాజీ సర్పంచ్‌ రూప్‌సింగ్‌ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ (జనరల్‌ ఫిజీషియన్‌), డాక్టర్‌ ఎన్‌. శోభ (పీడియాట్రీషియన్‌), మాలోత్‌ సురేష్‌, స్వర్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన పూజలు, హోమంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.