జగదాంబ మాత ఆలయంలో ఘనంగా మహా అన్నదానం, హోమం…అన్నోజిగూడలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు
ఘట్కేసర్, అక్టోబర్ 14 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న జగదాంబ మాత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు చండీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. పోచారం మాజీ సర్పంచ్ రూప్సింగ్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కిరణ్ కుమార్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ ఎన్. శోభ (పీడియాట్రీషియన్), మాలోత్...