📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్

📰 Generate e-Paper Clip

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్!

వంద మందికి పైగా సభ్యులు, కార్యకర్తల సామూహిక రాజీనామా

సేవా కార్యక్రమాలపై అసంతృప్తితో స్వచ్ఛందంగా వైదొలగాలని నిర్ణయం

కూకట్‌పల్లి, అక్టోబర్ 15 (ప్రజావాణి):

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్‌ఆర్‌సీఐ) సంస్థకు చెందిన వంద మందికి పైగా సభ్యులు, కార్యకర్తలు సామూహికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలో కొనసాగుతున్న కార్యకలాపాలు, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల నిర్వహణ, పారదర్శకత వంటి అంశాలపై సంతృప్తి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయం, పేదలకు అండగా నిలవడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆశయంతో సంస్థలో చేరామని రాజీనామా చేస్తున్న సభ్యులు తెలిపారు. అయితే తమ ఆశయాలకు, సంస్థలోని వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉండటంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వెల్లడించారు.

ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు లేకుండా వ్యక్తిగత నిర్ణయం మేరకే సభ్యత్వాలు, పదవులు, బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం సంస్థ పేరుతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమని, సంస్థకు సంబంధించిన గుర్తింపు కార్డులు, పత్రాలను నిబంధనల ప్రకారం తిరిగి అందజేస్తామని పేర్కొన్నారు.

ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో పనిచేసే సభ్యులకు తగిన అవకాశాలు, ప్రోత్సాహం, పారదర్శకత కల్పించాలని వారు అభిప్రాయపడ్డారు. తమ నిర్ణయం ఏ వ్యక్తిపైనా వ్యక్తిగత ద్వేషంతో తీసుకున్నది కాదని, తమ అభిప్రాయాలను అధికారికంగా తెలియజేయడమే ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఈ సామూహిక రాజీనామా ప్రకటనకు కందుల చెందు, నేషనల్ జనరల్ సెక్రటరీ, కారీ దాసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, అమృతం వీరా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కొండల రాజేందర్ కుమా�

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.