*మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు*
* *మన ప్రజావాణి* *మందమర్రి*:-
పట్టణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతుండగా, బుధవారం నాలుగవ రోజు అమ్మవారు మహాచండి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని రెండవ జోన్ లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ కనకదుర్గ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా మండలి ఆధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన చేసి, లోకకల్యాణం, కుటుంబాల సుఖసంతోషాలు, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.పూజా కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
