📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల మండలం కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

మంచాల మండలం కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

*మంచాల మండలం కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం*

*గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు.. కంటి అందత్వం నిర్మూలన కల్పించడమే లక్ష్యం.*

*క్యాంపు కోఆర్డినేటర్ అశ్వల బాలరాజ్.*

మంచాల, అక్టోబర్ 15 :

రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 15 (ప్రజావాణి)మంచాల గ్రామంలో జన సందేశ్ ఫౌండేషన్, ఐ కేర్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, ఎం.ఎస్. రెడ్డి సారథ్యంలో గురువారం, అక్టోబర్ 15న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంచాల గ్రామంలోని మండల బీజేపీ కార్యాలయం వద్ద ఈ శిబిరం కొనసాగనుంది.

ఈ శిబిరంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఈసీజీ (ECG) పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను కూడా ఉచితంగా చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని దోమలగూడ గోల్డెన్ జూబ్లీ సాధురాం ఐ హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరం

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తరచుగా ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచాల గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ శిబిరం ద్వారా కంటి చూపు తగ్గడం, కళ్లలో మంట, కంటి నొప్పి వంటి సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవచ్చు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా తగిన వైద్య సలహాలు పొందే అవకాశం ఉంటుంది. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ల సదుపాయం కూడా కల్పించనుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎంతో మేలు జరుగుతుంది అన్ని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.