📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబతుకమ్మ వేడుకలకు అడ్డంకులంటూ డీఎస్పీపై మహిళల ఆరోపణలు...పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.. బాలాజీనగర్‌ కాలనీ మహిళల...

బతుకమ్మ వేడుకలకు అడ్డంకులంటూ డీఎస్పీపై మహిళల ఆరోపణలు…పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.. బాలాజీనగర్‌ కాలనీ మహిళల వెల్లడి

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్, అక్టోబర్ 13 (ప్రజావాణి):*తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రశాంతంగా జరుపుకోలేకపోతున్నామని మేడ్చల్‌ జిల్లా ఘాట్ కేసర్ సర్కిల్ లోని కోర్రెముల బాలాజీనగర్‌ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ బొమ్మినేని శ్రీరామ్‌ రెడ్డి తమను బెదిరిస్తూ బతుకమ్మ, వినాయక చవితి వేడుకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకమ్మ పండుగ నిర్వహించవద్దంటూ పోచారం ఐటీ కారిడార్‌ పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. వినాయక చవితి సందర్భంగా కూడా బెదిరింపులు ఎదురుకావడంతో పూజలు నిర్వహించకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా, తమను వెంటనే లోపలికి అనుమతించలేదని, అర్ధరాత్రి ఒంటి గంట వరకు బయటే వేచి ఉండాల్సి వచ్చిందని మహిళలు ఆరోపించారు. స్టేషన్‌లో డీఎస్పీ ఉన్నప్పటికీ తమ ఫిర్యాదును స్వీకరించడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. చాలా సేపటి తర్వాత ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు.

పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. బతుకమ్మ పండుగను స్వేచ్ఛగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, తమ ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు బొల్ల సుధీర్‌ రెడ్డితో, సిద్ధార్థ, మారుతి, దేవేందర్‌ రెడ్డి, రవి, సతీష్‌, లింగచారి, రమణ, వెంకటేశ్వర్లు, రాకేష్‌ రెడ్డి, సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు రజిని, స్రవంతి, హరిత, కల్యాణి, సబిత, లక్ష్మి, భాగ్య, తేజస్విని, పద్మ, మాధవి, తేజ, మమత, మానస, సుప్రద, మంజుల, లత, అనూష, స్వాతి, సునీత, తిరుపతమ్మ తదితరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.