బతుకమ్మ వేడుకలకు అడ్డంకులంటూ డీఎస్పీపై మహిళల ఆరోపణలు…పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.. బాలాజీనగర్‌ కాలనీ మహిళల వెల్లడి

  ఘట్‌కేసర్, అక్టోబర్ 13 (ప్రజావాణి):*తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రశాంతంగా జరుపుకోలేకపోతున్నామని మేడ్చల్‌ జిల్లా ఘాట్ కేసర్ సర్కిల్ లోని కోర్రెముల బాలాజీనగర్‌ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ బొమ్మినేని శ్రీరామ్‌ రెడ్డి తమను బెదిరిస్తూ బతుకమ్మ, వినాయక చవితి వేడుకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకమ్మ పండుగ నిర్వహించవద్దంటూ పోచారం ఐటీ కారిడార్‌ పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చారని...