📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నర్సుల కొరత

సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నర్సుల కొరత

📰 Generate e-Paper Clip

సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నర్సుల కొరత

అక్టోబర్ 13 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం: సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, నర్సుల కొరతతో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుండగా, అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని చెబుతున్నారు.
డాక్టర్లు, నర్సుల కొరత కారణంగా రోగులు వైద్యం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సంగెం పీహెచ్‌సీలో సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించి, పూర్తిస్థాయిలో వైద్యులు, నర్సులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.